ZS News / ప్రభాస్, నీహారిక పెళ్లి వార్తలపై స్పందించిన చిరు

123

ZS News (Cinema) : ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ ఎవరంటే ముందుగా గుర్తొచ్చేది బాలీవుడ్‌లో అయితే సల్మాన్ ఖాన్, టాలీవుడ్‌లో అయితే ప్రభాస్. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌కు కొన్ని వేల పెళ్లి సంబంధాలు వచ్చాయట కానీ ప్రభాస్ స్పందించలేదని సమాచారం. ఇటీవల మెగా డాటర్ నీహారికకు, ప్రభాస్‌కు పెళ్లి అనే వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది.

ప్రభాస్, నీహారిక పెళ్లి వార్తలపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ప్రస్తుతం నీహారిక తన కెరీర్‌పై దృష్టి పెట్టింది కాబట్టి రూమర్స్‌ని తక్షణమే ఆపేయండి అని వెల్లడించారు. అంతకు ముందు ప్రభాస్, అనుష్క మధ్య లవ్ అఫైర్ ఉందని.. వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు బాగా వైరల్ అయ్యాయి. చాలా సందర్భాల్లో ఈ ఇద్దరు స్టార్స్ ఈ వార్తలను ఖండించిన విషయం తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో సాహో సినిమా షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఓ ఛేజింగ్ సీన్ కోసం త్వరలో సాహో యూనిట్ యూఏఈ వెళ్లనుంది.

Leave a comment