ZS NEWS / రామ్ చరణ్ హీరోయిన్ ని నైటీలో రమ్మన్న దర్శకుడు..!

145

ZS NEWS (Cinema) : రామ్‌చరణ్‌ ‘తుఫాన్‌’లో మోనా డార్లింగ్‌గా కనిపించి కుర్రకారును ఆకర్షించేసిన కత్తి లాంటి అమ్మాయి గుర్తుందా. ఆమే. మహిగిల్‌. ‘బుల్లెట్‌ రాజా’ చిత్రంలో డోంట్‌ టచ్‌ మై బాడీ. అనే హాట్ ఐటం సాంగ్ లో ఆడిపాడింది. ఇప్పుడు ఆమె తనకు జరిగిన ఓ విషయాన్ని బయటపెట్టింది. క్యాస్టింగ్ కౌచ్ ప్రశ్న ఆమెకు ఎదురవ్వగా.. తనను ఓ డైరెక్టర్ నైటీలో రమ్మని అడిగాడని చెప్పుకొచ్చింది. ‘ఒక సినిమా ఛాన్స్ విషయంలో నేను అతడిని మీట్ కావాల్సి వచ్చింది. నేను మామూలు సల్వార్ కమీజ్‌లో వెళ్లాను. పాత్ర తీరు తెన్నులను చెప్పని ఆ దర్శకుడు.. నువ్వు నైటీలో ఎలా ఉంటావో చూడాలని ఉంది అని అన్నాడు. ఇలా సల్వార్ కమీజ్‌లో చూసి అవకాశం ఇవ్వలేను, నైటీలో నువ్వెలా ఉంటావో చూసి, సినిమా ఛాన్స్ ఇస్తానని అతడు మాట్లాడాడని..’ చెప్పుకొచ్చింది. తాను ఆ తర్వాత ఆ సినిమా గురించి పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది. మొత్తం ఘటన గురించి చెప్పిన మాహీ గిల్.. ఆ దర్శకుడి పేరు చెప్పడానికి మాత్రం ఇష్టపడలేదు.

Leave a comment