ZS News / నెల్లూరు నగరంలోని పోలీసు స్టేషన్స్ పరిధులు పేర్లు మార్పు

44

ZS News (నెల్లూరు) : గవర్నమెంట్ అఫ్ ఆంధ్రప్రదేశ్ జి.ఓ.నెం:48మేరకు నెల్లూరులో బౌగోళికంగా కొన్ని పోలీస్ స్టేషన్ పరిధులు వేరే పోలీస్ స్టేషన్ పరిధి లోకి తీసుకోనిరావటం, పోలీస్ స్టేషన్ ల పేర్లు మార్పులు  చేయటం జరిగినదని జిల్లా ఎస్పి పిహెచ్‌డి రామకృష్ణ తెలిపారు. ఇందులో మొదటిగా నెల్లూరు 1 వ పట్టణ పోలీస్ స్టేషన్ ను చిన్నబజార్ పోలీస్ స్టేషన్ గా మార్పు చేయటం జరిగినదని, ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోకి కొత్తగా నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న పుత్తా ఎస్టేట్, పరమేశ్వరి నగర్, రాజీవ్ గృహకల్ప చేర్చడం జరిగినదన్నారు. నెల్లూరు 4 వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆర్.టి.సి. బస్సు స్టాండ్, ఫతేఖాన్ పేట, అరవింద్ నగర్, జూబ్లి హాస్పిటల్, మద్రాస్ బస్సు స్టాండ్, ముత్తుకూరు బస్ స్టాండ్  చిన్న బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో కి చేర్చడం జరిగిందన్నారు. నెల్లూరు 2 వ పట్టణ పోలీస్ స్టేషన్ ను నవాబుపేట పోలీస్ స్టేషన్ గా పేరు మార్పు చేయటం జరిగినదని, ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో కి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వెంకటేశ్వరపురం,జనార్ధనరెడ్డి కాలనీ,పరమేశ్వరి నగర్ చేర్చడం జరిగిందన్నారు. నెల్లూరు 3 వ పట్టణ పోలీస్ స్టేషన్ ను సంతపేట పోలీస్ స్టేషన్ గా పేరు మార్చటం జరిగినదని, ఈ స్టేషన్ పరిధిలోకి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గాంధీగిరిజనకాలనీ చేర్చడం జరిగిందన్నారు. నెల్లూరు 4 వ పట్టణ పోలీస్ స్టేషన్ ను దర్గామిట్ట పోలీస్ స్టేషన్ గా పేరు మార్చడం జరిగినదని, ఈ స్టేషన్ పరిధిలోకి నెల్లూరు1 వ పట్టణ పోలీస్ స్టేషన్ వున్న బారాషాహిద్, కలెక్టర్ బంగ్లా, డికెడబ్ల్యూ కాలేజీ, న్యూ జిల్లా పోలీస్ కార్యాలయము చేర్చడం జరిగిందన్నారు. నెల్లూరు 5వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రగతినగర్, గవర్నమెంట్ హాస్పిటల్, రాజరాజేశ్వరి టెంపుల్, ఏ.సి. స్టేడియం, పోలీస్ కాలని, రెవిన్యూ కాలనీ ,జ్యుడిషియల్  క్వార్టర్స్, జెడ్.పి. కాలనీ, పోస్టల్ కాలనీ, ఎస్.డి.పి.ఓ. నెల్లూరు టౌన్ ఆఫీస్ చేర్చడం జరిగిందని చెప్పారు. నెల్లూరు 5 వ పట్టణ పోలీస్ స్టేషన్ ను వేదాయపాలెం పోలీస్ స్టేషన్ గా పేరు మార్చడం జరిగినదని, ఈ స్టేషన్ పరిధిలోకి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కొత్తూరు, అంబాపురం చేర్చడం జరిగిందన్నారు. నెల్లూరు 6 వ పట్టణ పోలీస్ స్టేషన్ ను బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ గా పేరు మార్చడం జరిగిందని చెప్పారు. ఈ స్టేషన్ పరిధిలో కి నెల్లూరు 4 వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రామలింగాపురం, హరనాధపురం, టి.డి.పి. ఆఫీస్, ముత్యలపాలెం, నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ చేర్చడం జరిగిందని అన్నారు. ఈమార్పులు ఈ నెల 17వ తేది నుండి అమలులోనికి వస్తాయని ఈ మార్పులను ప్రజలు గమనించ వలసిందిగా పత్రిక ముఖంగా తెలియ చేయటం జరిగిందని ఈ సందర్బంగా ఎస్పి వెల్లడించారు.

Leave a comment