ZS News / నెల్లూరులో ప్లే పార్క్ ఏర్పాటు చేసేందుకు రూ. 50 లక్షల మంజూరు – మంత్రి నారాయణ

22

ZS News (నెల్లూరు) : ఆదిత్యనగర్లో వున్న ఒకటిన్నర ఎకరాలో ప్లే పార్క్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకోసం తొలివిడతగా 50 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఆదిత్యనగర్లో తాళ్ళపాక అనూరాధ, రమేష్ రెడ్డిల ఆధ్యక్షతన జరిగిన ఆత్మీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా తాగునీరు, రోడ్ల మరమ్మత్తుల సమస్యలను స్థానికులు తన వద్దకు తీసుకొచ్చారని చెప్పారు. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. నెల్లూరును స్మార్ట్ సిటీగా మార్చేందుకు 500 కోట్లు విడుదల చేసినట్లు నారాయణ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నుడాఛైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ది కమిటీ ఛైర్మన్‌ చాట్ల నరసింహారావు, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, విజయ డైరీ ఛైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి, టిడిపి నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment