యాదవ యువ కిశోరం డా.నాగేంద్ర – యాదవ ఆత్మీయ సదస్సులో వక్తలు

28
ZS News (Nellore) : సింహపురి హాస్పిటల్స్ కార్డియాలజిస్ట్  డా.నాగేంద్ర ప్రసాద్ అత్యంత పిన్న వయస్సులో అత్యున్నత స్థాయిని అందుకున్నారని పలువురు వక్తలు కొనియాడారు. స్థానిక మహేశ్వరీ పరమేశ్వరి కల్యాణ మండపంలో జరిగిన యాదవ ఎంప్లాయిస్ సొసైటీ ఆత్మీయ సదస్సుకు డా.నాగేంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా హజరైన నెల్లూరు నగర శాసన సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, శాసన మండలి సభ్యులు డా. బీద రవిచంద్ర, జిల్లా యాదవ ఉద్యోగ సంఘ నాయకులు మట్లాడుతూ డా.నాగేంద్ర జిల్లాలోనే ప్రప్రథమ యాదవ కార్డియాలజిస్టు అని ఆయన మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నామన్నారు. డా.నాగేంద్రను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా డా.నాగేంద్ర మట్లాడుతూ యాదవ ఎంప్లాయిస్ సొసైటీ సభ్యులు ఎవరైనా తనను ఉచితంగా సంప్రదించవచ్చని వారికి పరీక్షల్లో 50 శాతం రాయితీ ఉంటుందని ఆయన తెలిపారు. తాను అందిస్తున్న వైద్య సేవలకు పూర్తి సహకారం అందిస్తున్న సింహపురి హాస్పిటల్స్ యాజమాన్యానికి కృతఙ్ఞతలు తెలియజేశారు.

Leave a comment