ZS NEWS/మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.. కుమారస్వామి గవర్నర్ కు లేఖ

10

ZS NEWS /బెంగళూరు పద్మనాభనగర్‌లో తన తండ్రి దేవెగౌడతో భేటీ అయి చర్చించిన అనంతరం జేడీఎస్‌ నేత కుమారస్వామి తుది నిర్ణయం తీసుకున్నారు.

కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావలసిన సభ్యులు తమ వద్ద వున్నారంటూ , తమకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇవ్వనుందని తమ రాష్ట్ర గవర్నర్‌కు కుమారస్వామి ఓ లేఖ రాశారు. కాగా ఈ రోజు సాయంత్రం 5.30 నుంచి 6 గంటల మధ్య గవర్నర్‌ను కలిసేందుకు తమకు అపాయింట్‌మెంట్‌ కావాలని, తాము కాంగ్రెస్‌ మద్దతును అంగీకరిస్తున్నామని ఆ లేఖలో కుమారస్వామి పేర్కొన్నారు.

Leave a comment