ZS NEWS /అనుమతులు లేకుండా అడ్మిషన్లు ప్రారంభం

8

ZS NEWS(NELLORE) శ్రీచైతన్య టెక్నో స్కూల్‌ యాజమాన్యం ప్రభుత్వ అనుమతి లేకుండా జిల్లాలోని ముత్తుకూరు, కావలి, పొదలకూరు, తదితర ప్రాంతాల్లో అడ్మిషన్లు ప్రారంభించాయని, ఇది విరుద్ధమని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా విద్యార్థి జేఏసీ కన్వీనర్‌ డి.అంజయ్య డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ వద్ద ఆ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఓ వైపు మంత్రి గంటా శ్రీనివాసరావు అనుమతులు లేని పాఠశాలలను మూసి వేయాలని ఆదేశాలు జారీ చేస్తుంటే.. జిల్లా విద్యాశాఖాధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా కలెక్టరు, డీఈవోలు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయిజయంత్‌, హరీష్‌యాదవ్‌, రామేశ్వర్‌, పవన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment