ZS NEWS /నెల్లూరు లో ఘనంగా బిజెపి నేతల సంబరాలు

8

ZS NEWS (NELLORE) కర్ణాటక ఎన్నికల్ల్లో అతిపెద్ద పార్టీ గా బీజేపీ అవతరించిన సందర్భంగా నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ సెంటర్‌ వద్ద బిజెపి కార్యకర్తలు బాణా సంచాలు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు బిజెపిని ఓడించాలని ఉద్దేశంతో కర్ణాటకలో ఉన్న ప్రజలను రెచ్చ గొట్టారని కానీ అక్కడి తెలుగు ప్రజలందరు కూడా బిజెపి అభ్యర్థులను గెలిపించారన్నారు. రానున్న 2019 ఎన్నికల్లో ఆంధ్రాలోను బిజెపి జయకేతనం ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆయన ప్రజల కోసం చేసే స్వచ్ఛ భారత్, జన్ ధన్ ముద్ర లోన్ లు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో ఉపయోగపడే పథకాలు ప్రవేశపెట్టినది ప్రధాని నరేంద్రమోదీ ఒక్కరే నన్నారు. నరేంద్రమోదీ ఉన్నంత వరకు బిజెపి దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఎంపి స్థానాలు సాధించి తిరిగి ప్రధానిగా ఉండటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు, కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment