ZS NEWS /వింజమూరులో మీ భూమికి – భరోసా కార్యక్రమం

18

ZS NEWS (Vinjamuru) చుక్కల భూములు 22ఎ రిజిష్టర్లు, నోషనల్‌ ఖాతాలకు సంబంధించి, భూమికి సంబంధించి చిన్న చిన్న సమస్యలను పరిష్కరించేందుకై ఎప్రిల్‌ 24 నుండి మే 31 వరకు మీ భూమికి – భరోసా కార్యక్రమం చేపట్టడం జరిగిందని నెల్లూరు జిల్లా కలెక్టర్‌ ఆర్‌ ముత్యాలరాజు పేర్కొన్నారు. మంగళవారం వింజమూరు మండలంలోని జిల్లా పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీ భూమికి – భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విజమూరు మండలంలో నేషనల్‌ ఖాతాలు 1575 గా గుర్తించడం జరిగిందని, వాటిని రెగ్యుల రైజ్‌ చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. అదే విధంగా ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌లలో ఎక్కువ రెవన్యూ సంబంధిత విషయాలు వున్నందున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిబందనల మేరకు త్వరలో అందరికి నివాస స్థలాలు మంజూరు చేయనున్నందున స్మార్ట్‌ పల్స్‌ సర్వే ఆధారంగా లబ్దిదారులను గుర్తించి ఒక ఎకరాకు 40 మందికి చొప్పున అందజేయడం జరుగుతుందన్నారు. సదరు భూములు గుర్తించుటకై ప్రభుత్వ భూములు, పట్టా భూములు పరిశీలనలో వున్నాయన్నారు. వింజమూరు మండలంలో ఒక కాలనీలో 23 గృహాలు నిర్మించడం జరిగిందని, మరో 2 గృహాలు నిర్మించిన పిదప రాష్ట్ర ప్రభుత్వం నుండి మౌలిక వసతుల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు రెవెన్యు డివిజనల్‌ అధికారి బాపిరెడ్డి, తహసిల్దార్‌ లావణ్య, జడ్‌పిటిసి వెంకట నారాయణరెడ్డి, సర్పంచ్‌ బాలకృష్ణారెడ్డి, ఎంపిటి కృష్ణ కిరణ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment