ZSNEWS/ కోవిడ్ సెంటర్లలో త్వరితగతిన మౌళిక వసతులు ఏర్పాట్లు చేయండి-అధికారులను ఆదేశించిన కలెక్టర్ చక్రధర్ బాబు

నెల్లూరు నగరంలోని నూతన జిల్లా పరిషత్ ప్రాంగణంలోని డి.ఈ.ఓ.సి నందు శుక్రవారం సాయంత్రం కలెక్టర్  కె.వి.ఎన్.చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్  డా.వి.వినోద్ కుమార్ తో కలిసి.., కోవిడ్ సెంటర్లకు ఇంఛార్జిలుగా ఉన్న నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రాబోయో రెండు నెలలు ఎంతో కీలకమని.., కరోనా పాజిటివ్ కేసులు పెరగడం వల్ల కోవిడ్ ఆస్పత్రులపై ఒత్తిడి పెరుగుతోందని.., అసెంథమాటిక్, మైల్డ్ లక్షణాలున్న యువకులు, 45 ఏళ్ల లోపు వారిని కోవిడ్ సెంటర్లకు తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ సెంటర్లలో పౌష్టికార భోజనం, మెరుగైన వైద్యం అందించాలని.., చికిత్స తీసుకుంటున్న వారితో నోడల్ అధికారులు వీడియో కాల్ ద్వారా ప్రతిరోజూ మాట్లాడి.., వారి సమస్యలు తెలుసుకోవాలని, ఎవరైనా ఒత్తిడికి గురైతే వారికి భరోసా ఇవ్వాలన్నారు. కోవిడ్ మహమ్మారి నిర్మూలణలో నోడల్ అధికారులది కీలకపాత్ర అని గుర్తుచేశారు. కోవిడ్ సెంటర్లలో మూడు షిప్టుల్లో వైద్యులు, పారా మెడికల్ సిబ్బందిని నియమించాయమని.., ఎక్కడైనా వైద్యుల కొరత ఉందా అని నోడల్ అధికారులను కలెక్టర్ ప్రశ్నించారు. కొన్ని సెంటర్లలో వైద్యులు, నర్సులు, బెడ్స్, పల్స్ ఆక్సీమీటర్లు, ల్యాబ్ టెక్నీషియన్ల కొరత ఉందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ తక్షణం వైద్యుల కొరత ఉన్నచోట నియమిస్తామని.., నోడల్ అధికారులు కూడా క్వారంటైన్ లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని వ్యక్తిగతంగా గమనిస్తూ.., ఎవరైనా సీరియస్ కోవిడ్ వ్యాధి లక్షణాలతో ఇబ్బందు పడుతున్నా..? రక్తంలో ఆక్సిజన్ శాతం తొంభై శాతం కన్నా తక్కువకు చేరినా..? అలాంటి వారిని వెంటనే కోవిడ్ ఆస్పత్రికి తరలించాలన్నారు. నెల్లూరు జిల్లాలో కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ.., వైరల్ లోడ్ తక్కువగా ఉందని.., దీనివల్ల మెరుగైన చికిత్స అందిస్తే మరణాలను నివారించవచ్చాన్నారు. కోవిడ్ కేర్ సంటర్ లో చికిత్స తీసుకుని.., నెగటివ్ రిజల్టు వచ్చి ఇంటికి వెళ్లినవారిని కూడా పరిశీలిస్తూ ఉండాలన్నారు. రేపు ఉదయం కల్లా కోవిడ్ కేర్ సెంటర్లలో బెడ్స్ అన్నీ పాజిటివ్ వ్యక్తులతో భర్తీ చేయాలన్నారు. వసతి సదుపాయం ఉన్న చోట.., బెడ్స్ సంఖ్యను పెంచాలన్నారు. సెప్టెంబర్ నాటికి ఐదువేల బెడ్స్ కోవిడ్ కేర్ సంటర్లలో ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. జిల్లా కోవిడ్ సెంటర్ల ఇంఛార్జిగా డి.ఎఫ్.ఓ షణ్ముక్ కుమార్ ని నియమిస్తున్నామని.., వారితో కో-ఆర్డినేట్ చేసుకుంటూ కోవిడ్ సెంటర్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలన్నారు. నోడల్ అధికారుల తాము చేస్తున్న పనిని.., ఉన్నతమైన బాధ్యతగా గుర్తించాలని.., కరోనా బారిన పడిన వారిని కాపాడి వారి కుటుంబాల్లో సంతోషం నింపే అద్బుతమైన అవకాశం అధికారులకు ఉందన్నారు. హోం ఐసేలేషన్ లో ఉన్నవారిని ప్రతిరోజూ ఎ.ఎన్.ఎంలు, ఆశా వర్కర్లు, పి.హెచ్.సి వైద్యులు పరిశీలిస్తూ.., వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ( ఆసరా) డా.  శీనా నాయక్, డా.  చెన్నయ్య, నోడల్ అధికారులు పాల్గొన్నారు.

Another reason why it could be time for you to call a school paper writing service is really that a college writing service can offer insights and legit essay writing service suggestions on your own composition.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
antalya escort ankara escort kayaşehir escort ankara escort halkalı escort capa escort malatya escort avrupa yakası escort avrupa yakası escort cankaya escort